లాగ్ డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఓఆర్ఎస్ మజ్జిగ పంపిణీ

లాగ్ డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఓఆర్ఎస్ మజ్జిగ పంపిణీ .........


ఏఎస్ పేట,మే 17 :


(అంతిమ తీర్పు రహమత్ అలి )..............కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాగ్ డౌన్  విధించడంతో ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి మండల కేంద్రమైన ఏఎస్ పేటలోని దర్గా ఎదురుగా గల రోడ్డులో ఉన్న హబీబ్ క్లినిక్& మెడికల్ నిర్వాహకులు డాక్టర్ షేక్. ఖాజామియా  డాక్టర్ షేక్. సిరాజ్ ల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఓఆర్ఎస్ మజ్జిగ ఇతర ఎనర్జీ పానియాలను అందిస్తున్నారు అందులో భాగంగా ఆదివారం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు వైద్య సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఖాజామీయా మాట్లాడుతూ లాక్డౌన్ మొదలైనప్పటి నుండి గత 55 రోజులుగా తమ వంతుగా తమ కోసం కష్టపడుతున్నా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వాలెంటీర్లకు లకు ఎనర్జీ పానీయలైన ఓఆర్ఎస్, బాదం మిల్క్, మజ్జిగ, లస్సీ, లాంటివి తమ వంతుగా పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ ఖాజామియా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరాజ్ తోపాటు అదీ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు