కష్ట కాలంలో ముఖ్యమంత్రి కొత్త పథకం " జగనన్న  గొంతుతడి"- షేక్ బాజి.


(విజయవాడ)


 *కష్ట కాలంలో ముఖ్యమంత్రి కొత్త పథకం " జగనన్న  గొంతుతడి"- షేక్ బాజి.*


మద్యం షాపులు తెరిచి మరో " జగనన్న గొంతు తడి" పథకానికి తెర లేపి తడిగుడ్డతో గొంతు కోసారని ,గత 45 రోజులుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ను సమూలంగాఅంతంమొందించేందుకు ప్రతినపునినా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి అదేశాలను సైతం జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పేడుతున్నారని ఈరోజు నుండి కేంద్రం రెండు వారాలు లాక్డౌన్ పొడిగిస్తూ సూచనలు జరిచేస్తే పట్టించుకోకుండా అన్ని  వివిధ జోన్లును ఏర్పాటు  చేస్తే అన్నింటిని ఒక్కటి చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూన్నారని భాజపా జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాప్ లు ప్రారంభానికి అనుమతి ఇచ్చి రాత్రికి రాత్రే అమాంతంగా రేట్లు పెంచి పేదవాళ్ళ పొట్టగొడుతున్నారని మద్యపాన నిషేదం అంటే అడ్డగోలు రేట్లు పెంచటం కాదని అంచెలంచెలుగా దుకాణాలు తగ్గిస్తే సరిపోతుంది అని సూచించారు. మీ ప్రభుత్వం తీసుకున్న తీరువల్ల ఈరోజు రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చి చేరారని వారిని పోలీస్ యంత్రాంగం ఎంతవరకు అదుపు చేయగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.