వైద్య అధికారుల సూచనలు పాటించండి : తిరుపతి శాసన సభ్యులు

 


వైద్య అధికారుల సూచనలు పాటించండి... తిరుపతి శాసన సభ్యులు


తిరుపతి మే 02 : నేడు ఇంటికి వెళుతున్న మీరు వైద్య అధికారుల సూచనలు మరో 14 రోజులు పాటించాలని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర రెడ్డి 11 మందికి  డిస్సార్జి కాపీలు అందించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంటికి వెళ్లిన తరువాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.


ఏప్రిల్ 19న ఒక్కసారిగా జిల్లా అంతటా ఉత్కటంత 25 కేసుల నమోదు జరిగింది తెలిసిందే, నేడు 14 రోజులు తరువాత రెండుసార్లు నెగటివ్ రావడంతో రుయా ఐసోలేషన్లో ఉన్న 30 మంది లో నేడు ఒక్కసారిగా 11 మంది డిస్సార్జి తిరుపతి శాసన సభ్యులు నుండి అందుకున్నారు. అందులో 10 మంది శ్రీకాళహస్తి, ఒక్కరు తిరుపతి నివాసులు.
 తిరుపతి స్ధానిక వ్యక్తి వయస్సు 25 సం, శ్రీకాళహస్తి వ్యక్తులు 42, 37, 27, 20,40,23,30,30,44, 58 వయస్సు వారు కాగా ఇందులో ఇద్దరు స్త్రీలు వున్నారు.  8 మంది విధులు నిర్వహిస్తున్న సమయంలో పాజిటివ్ వ్యక్తులు గా నమోదు అయిన వారు ఉన్నారు. 


రుయా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్  సూపరినెంట్ భారతి డా.సుబ్బారావు, డిఎం హెచ్ ఓ పెంచలయ్య, ఆర్.ఎం.ఓ. ఇబి దేవి, తదితరులు ఉన్నారు.