ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు E-PASS (ఈ-పాస్‌)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం : డి.జి.పి

 తేది :13.05.2020
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ 
ఆంధ్ర ప్రదేశ్ 
రాష్ట్ర ప్రజల క్రియాశీల సహకారంతో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది.  ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేయబడ్డాయి. అయినప్పటికీ, కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు పౌరులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ పరిస్థితిలో కొంతమంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ తో ప్రయాణించేవారు, కుటుంబంలో మరణం, సామాజిక పనుల కోసం,  ప్రభుత్వ విధి నిర్వహణలో లేదా ఇతర  అత్యవసరమైన వాటి కోసం ప్రయాణించడానికి ఇక్కట్లు పడుతునట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రయాణానికి అవసరమైన వారికి పాస్ ఇవ్వమని పోలీసు శాఖను ఆదేశించారు. ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు E-PASS (ఈ-పాస్‌)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
 అత్యవసర పాస్‌ల కోసం అభ్యర్థించే వారు ఈ క్రింది సమాచారాన్ని అందించాలి:
1. ఫోటోతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబర్
2.  మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు మొదలైనవి అప్‌లోడ్.
3. ఆధార్‌ను అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు 
4. పూర్తి ప్రయాణ వివరాలు. 
5. ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్య. కారుకు (1+3) అనుమతి.  
 Https: citizen.appolice.gov.in వెబ్‌సైట్‌లో పైన పేర్కొన్న అన్ని వివరాలతో పౌరులు/ ప్రజలు కోవిడ్ 19 అత్యవసర వాహన e-pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదించబడితే వాహన అత్యవసర e-pass ను దరఖాస్తు చేసుకున్నా వారి మొబైల్ నెం లేదా మీరు దరఖాస్తు చేసిన మెయిల్ ఐడికి పంపబడతాయి. వెబ్‌సైట్ నుండి జారీ చేసిన అత్యవసర పాస్‌లు మాత్రమే అంగీకరించబడతాయి.  అత్యవసర వాహన పాస్‌తో పాటు, పౌరులు ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సమర్పించిన వివరాల ధృవీకరణ తరువాత, వీలైనంత త్వరగా ఈ-పాస్ జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై తగిన చర్యలు తీసుకుంటారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు