భవన  నిర్మాణ కార్మిక సంఘం  (సీఐటీయూ)  చెన్నూరు ఆధ్వర్యములో  వలస కార్మికులకు రెండవ రోజు భోజనం పంపిణీ    

భవన  నిర్మాణ కార్మిక సంఘం  (సీఐటీయూ)  చెన్నూరు ఆధ్వర్యములో  వలస కార్మికులకు రెండవ రోజు భోజనం పంపిణీ


    గూడూరు మే 16 (అంతిమ తీర్పు):                                లాక్ డౌన్  అమలులో  ఉన్న కారణంగా పని కోల్పోయిన వలస కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం. గూడూరు మండలం చెన్నూరు భవన నిర్మాణ కార్మిక సంఘం  కమిటీ  ఆధ్వర్యములో చెన్నూరు కామ్రేడ్   Sk. జాఫర్ సాహెబ్  జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో 100 మందికి గూడురు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద  భోజనం పంపిణీ కార్యక్రమం
జరిగినది పై కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు R. శ్రీనివాసులు మాట్లాడుతూ వలస కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ ఖర్చుతో వారి ప్రాంతాలకు చేర్చేవిధంగా చర్యలు  చేపట్టాలని ప్రతి కార్మికునికి 7500 రూపాయలు ఆర్ధిక సహాయం చేయాలని కోరారు పై కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి A.కేశవులు, భవన నిర్మాణ కార్మిక సంఘం చెన్నూరు కమిటీ సభ్యులు గంటా  వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ గూడూరు కార్యదర్శి B.V. రమణయ్య, నారే వెంకటప్పయ్య, పేరిశెట్ల శ్రీనివాసులు,గడ్డం వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.