ఇవాళే మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని ఆదేశించిన సీఎం

*10–05–2020*
*అమరావతి*


*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*అమరావతి:*
*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*
*తన నివాసంలో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి*
*కంపెనీలో గ్యాస్‌లీకేజీని అరికట్టడానికి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి*
*అలాగే బాధితులు కోలుకుంట్ను వైనం, వారికి చికిత్స అందుతున్న తీరును నివేదించిన అధికారులు*
గాలిలో గ్యాస్‌ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని తెలిపిన అధికారులు
దీనిపై నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించిన అధికారులు 
కంపెనీ సమీప గ్రామాల్లో స్టెరెన్‌ గ్యాస్‌ అవశేషాల తొలగింపునకు చేపడుతున్న చర్యలపై అధికారులనుంచి వివరాలు తెలుసుకున్న సీఎం
గ్రామాల్లో ముమ్మరంగా శానిటేషన్‌ జరపాలని సీఎం ఆదేశాలు
అన్నిరకాల చర్యలను తీసుకున్న తర్వాతనే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశాలు


*ఇవాళే మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని ఆదేశించిన సీఎం*
*రేపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశం*
మిగిలిన వారికి కూడా ప్రకటించిన విధంగా సహాయం అందించడానికి తగినన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం