శానిటైజర్లు, మాస్కులు, కూరగాయలు పంపిణీ

శానిటైజర్లు, మాస్కులు, కూరగాయలు పంపిణీ


వింజమూరు, మే 9 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం నాడు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, పాత్రికేయులుకు కేంద్ర సామాజిక, న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు వెన్నపూస.శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో శానిటైజర్లు, మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కలిగిరి సి.ఐ రవికిరణ్, స్థానిక తహసిల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డి, పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి, దాతలు నంబూరి.సురేష్ రెడ్డి, ఉప్పలపాటి.సునీల్ లు, రాయపూడి.కిషోర్, పోలిశెట్టి.వీరబ్రహ్మయ్య, నోటి.మాల్యాద్రిరెడ్డి, బి.జె.పి నేతలు బయ్యపురెడ్డి.రవిశంకర్ రెడ్డి, శ్రీరాం.శ్రీనివాసులు, మల్లం.కొండారెడ్డి, మూలా.బాలక్రిష్ణారెడ్డి, డేగా.మధుయాదవ్, చల్లా.కౌశిక్, లెక్కల.రాజశేఖర్ రెడ్డి, బయ్యపురెడ్డి.కేశవులురెడ్డి, బొగ్గవరపు.బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.