టెలిమెడిషన్ విధానంలో మందులు పంపిణీ చేయాలి ; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని 

జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు... 
* ఆరోగ్యసేతు యాప్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి
* టెలిమెడిషన్ విధానంలో మందులు పంపిణీ చేయాలి
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
అమరావతి: వైరస్‌పై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా ఎప్పటి కప్పుడు సందేశాలను ఇచ్చేందుకు వీలుగా జిఓ.సంఖ్య 257 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతోందన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని దీనిపై ఇప్పటికే జి.ఓ.సంఖ్య. 254 ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు.కావున ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా చూడాలన్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో  టెలీమెడిషన్ విధానం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.అంతేగాక టెలిమెడిషన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధితులకు మందులు అందేలా చూడాలన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో వైయస్సార్ క్లినిక్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రీన్ జోన్లలో వివిధ ఎంఎస్ఎంఇ యూనిట్లన్నీ ప్రారంభించి భౌతిక దూరాన్ని పాటించిస్తూ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈఎంఎస్ఎంఇలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిందని అనగా 2014-15 సంవత్సరాలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను క్లియర్ చేయడం జరుగు తుందని సిఎస్ పేర్కొన్నారు. అంతేగాక ఏప్రిల్ నుండి జూన్ వరకూ విద్యుత్ చార్జీల రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అలాగే వర్కింగ్ క్యాపిటల్ ను కూడా ఇవ్వడం జరుగుతుందని సిఎస్ తెలిపారు.3వ దశ లాక్ డౌన్ సమీపిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా లాక్ డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న టెస్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. టెలి మెడిసిన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధిత పిహెచ్ సిరి ద్వారా మందులు పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. వీడియో సమావేశంలో కొవిడ్ కంట్రోల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.