గూడూరు లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలొ రక్తదానం

గూడూరు మే 13 (అంతిమ తీర్పు) :


జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలొ రక్తదానం.......జనవిజ్ఞాన వేదిక గూడూరు వారి ఆద్వర్యంలొ గవర్నమెంట్ హాస్పిటల్ గూడూరు నందు 20మందికి పైగా జె.వి.వి. సభ్యులు రక్తదానం చేయడం జరిగింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం  మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నందు బ్లడ్ తక్కువగ ఉన్నందున జె.వి.వి. వారిని మా అసుపత్రి నందు రక్తము ఇవ్వమని కోరడమైనది. కరోన లాంటి విపత్కర పరిస్తితుల్లొకూడా జె.వి.వి. వారు వెంటనే స్పందించి 20 మందికి పైగా రక్తదానము చేసినందుకు వారికి రెండుచేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..మా ఆసుపత్రికి జె.వి.వి. వారు అన్నివిదాలుగ సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగ ఉందని తెలిపారు...రక్తము నిల్వలను ఆన్ లైన్లో ఉంచుతున్నామని ఎవరైనా చూసుకోవచ్చని అపోహాలు వద్దని తెలిపారు. పేదలు ఎవరికైనా రక్తము అవసరమైతే మమ్మల్ని సంప్రదించమని కోరారు...ఈ కార్యక్రమంలొ జె.వి.వి. అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, అశోక్, మనోహర్, శ్రీనివాస్,రాజశేఖర్ రెడ్డి, రూప్ కుమార్, మధు, సాయి, కిరణ్, ఇమ్రాన్, విశాల్, అఖిల్, ప్రదీప్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.