సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో  కావలి కావేరీ గుంట సమీపంలో ఉన్న నిరుపేద గిరిజన కుటుంబాలకు భోజనం ప్యాకెట్లు. పంపిణీ

   కావలి, మే 5 (అంతిమ తీర్పు).:                            సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో  కావలి కావేరీ గుంట సమీపంలో ఉన్న నిరుపేద గిరిజన కుటుంబాలకు మరియు  సిరిపురం  గిరిజన కుటుంబాలకు ,వైకుంఠ పురంలో ఉన్న నిరుపేదలకు 160 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. దాతలు  బొగ్గవరపు.క్రిష్ణ మూర్తి గారు,  తన్నీరు  రవి కుమార్ గారు, నాట్యాచార్యుడు  ముత్వంశెట్టి. ఉమా మహేశ్వర రావు గారు, మెడికల్ ఏజన్సీ  యస్ కే. అప్సర్  సహకారంతో  భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈరోజు ఉదయం  కుమ్మరి గుంట  అనీల్ కుమార్ గారి  సహకారంతో కావలి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మరియు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు 70 టిఫిన్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. దాత  సయ్యద్  సుభాని సహకారంతో కావలి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మంచి నీటి సదుపాయం కోసం 10 కూలింగ్ వాటర్ క్యాన్ లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్ సత్యం, హ్యాపీ సేవాసంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఘనిబాష, బొగ్గవరపు. స్వామి,జక్కంపూడి.ప్రసన్న కుమార్, కుమ్మరి గుంట  అనీల్ కుమార్ లు  పాల్గొనడం జరిగింది. మీ సురేంద్ర సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు 9966568368