ముఖ్యమంత్రి వైఎస్ చే బూర బృందం రచించిన"గురు స్మరణలో" పుస్తక ఆవిష్కరణ.

ముఖ్యమంత్రి వైఎస్ చే బూర బృందం రచించిన"గురు స్మరణలో" పుస్తక ఆవిష్కరణ.
 అమరావతి


సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్‌లో వందలమంది సీనియర్‌ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకు వచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’ . ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో  ఆవిష్కరించారు. 


బూదరాజుకు శిష్యులైన ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్‌ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


పత్రికారంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి అన్నారు. 


‘బూరా బృందం’గా పిలుచుకునే బూదరాజు శిష్యుల్లో పి.మధుసూదన్, ముని సురేష్‌ పిళ్ళె, ఎస్‌.రాము ఈ సంకలనాన్ని తీసుకువచ్చారు.


కరోనా నేపథ్యంలో ఈకార్యక్రమానికి తాము హాజరుకాలేకపోతున్నామని, పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ‘బూరా బృందం’ ధన్యవాదాలు తెలియజేసింది.
 సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్‌లో వందలమంది సీనియర్‌ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణగారి 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకు వచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’ . ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో  ఆవిష్కరించారు.