గమళ్లపాలెం లో పిచ్చి కుక్క హల్చల్

*గమళ్లపాలెం లో పిచ్చి కుక్క హల్చల్...


*భయాందోళనలో  గ్రామస్తులు*


*జలదంకి పంచాయతీ లోని గమళ్లపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి పిచ్చి కుక్క హల్చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. జంపాని తిరుపతి స్వామి రాత్రి   ఇంటి బయట నిద్ర పోతుంటే 2.గంటల సమయంలో పిచ్చి కుక్క కరిచి గాయపడ్డాడు.ఒక్కసారిగా పెద్దగా అరవడంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి కుక్కని  తరిమేసినట్లుగా తెలిపారు.తిరుపతి స్వామి  నెల్లూరు లోని ఒక ప్రవేట్ హస్పెటల్ లో చికిత్స పొందుతున్నట్లు  తెలిపారు. అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల ని పట్టించాలని గ్రామస్తులు కోరుతున్నారు..*