రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు:పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేది : 13.05.2020.
అమరావతి.


రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు:పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


అమరావతి,మే13 : రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని మంత్రి ఛాంబర్లో పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, కమిషనర్ మురళిలతో మంత్రి గౌతమ్ రెడ్డి షుగర్ పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్ కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మొత్తం  10 షుగర్ ఫ్యాక్టరీలు ఉండగా 6 మూతపడ్డాయని, 4 పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు.  ఈ నేపథ్యంలో మూతపడ్డ పరిశ్రమల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నివేదికను తయారు చేయాలని మంత్రి సూచించారు. మూతపడ్డ షుగర్ పరిశ్రమల ప్రస్తుత పరిస్థితులు, వాటిని మళ్ళీ పు:న ప్రారంభించడానికి అవసరమైన నిధులు, పరిశ్రమల్లో ఉన్న ఇబ్బందులు తదితర అంశాలపై మంత్రి చర్చించారు. త్వరలో ముఖ్యమంత్రితో రాష్ట్రంలో ఉన్న షుగర్ పరిశ్రమల అంశంపై సమీక్ష సమావేశం ఉండటంతో పూర్తి స్థాయి వివరాలను తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మూతపడిన షుగర్ పరిశ్రమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల సమస్యలు తదితర అంశాలను గుర్తించి, వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలకు ప్రభుత్వం కృషి చేయనుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరగబోయే సమీక్ష సమయానికి పూర్తి నివేదికలను సన్నద్ధం చేసుకొని తీసుకురావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.