మద్యం ధరల పెరుగుదల మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరచడానికే


                   సత్తెనపల్లి,మే 4 ( అంతిమ తీర్పు) :  మద్యం ధరల పెరుగుదల మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరచడానికేనని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన సత్తెనపల్లి లోని ప్రొహిబిషన్  మరియు ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రసంగిస్తూ  సి పి ఐ,  సి పి ఐ(యo)పార్టీ లు గతంలో సంపూర్ణ మద్య నిషేధం అసాధ్యమని,మద్య  నియంత్రణే మేలని పేర్కొన్నాయని నేడు దీనికి భిన్నంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని వెంటనే అమలు చేయమని కోరడం హాస్యాస్పదo అన్నారు.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాద యాత్రలో,నవరత్నాలలో, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా దశలవారీ మద్య నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
తత్ఫలితంగా దాదాపు 30 శాతం మద్యం వినియోగం 60 శాతం బీరు వినియోగం తగ్గిందన్నారు.మద్యం షాపుల సంఖ్యను ప్రతి సంవత్సరం 20 శాతం తగ్గించడం, మద్యం అమ్మే పనిగంటలు తగ్గించడం దశలవారీ మద్యనిషేధంలో భాగమేనన్నారు.2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో త్రీ స్టార్,ఫైవ్ స్టార్  హోటల్స్ లలో మినహ మరి ఎక్కడ మద్యం లేని పరిస్థితిని కల్పిస్తామన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ను మధ్యాంధ్రప్రదేశ్ గా మారిస్తే నేడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను మద్యరహిత ఆంధ్ర ప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. 


    మద్యం ధరలు పెరగడం వలన  నాటుసారా,  కల్తీకల్లు,  గంజాయి వినియోగం,ఉత్పత్తి పెరిగే ప్రమాదంవుందన్నారు. పోలీసు,ఎక్సైజు, రెవిన్యూ యంత్రాంగాల సమిష్టి కృషితో వీటిని నిర్మూలించడానికి కృషి జరుగుతుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను బలోపేతం చేస్తున్నామన్నారు. నాటుసారా,గంజాయి నిర్మూలనలో పోలీస్ పాత్ర పెరగాలన్నారు.
వైన్ షాపులకు వచ్చేవారు సామాజిక దూరాన్ని తప్పక పాటించాలి.ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలన్నారు.ముఖ్యమంత్రి రాజకీయ దృఢ సంకల్పమైన దశలవారీ మద్య నిషేధం అమలును  ఏ ప్రజా ప్రతినిధి అయిన, అధికారులైనా నీరుకార్చవద్దని విజ్ఞప్తి చేశారు.
   
కరోనా  కట్టడికి లాక్ డౌన్ అమలులో భాగంగా మద్యం విక్రయాలు నిలిపి వేయడం జరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో 49,533 లీటర్ల నాటుసారా పట్టుబడింది. ఈనెల 2వ తేదీ ప్రత్యేకంగా నిర్వహించిన దాడుల్లో 3,071 లీటర్లు పట్టుబడింది. లాక్ డౌన్ కాలంలో ఇంత వరకు మొత్తం 4,721 కేసులు నమోదుచేసి,4319 మందిని అరెస్టు చేశారు.12,21,103 లీటర్ల బెల్లం ఊట దొరికింది.1,251 వాహనాలను సీజ్ చేశారు. అలాగే 37,270 కిలోల నల్ల బెల్లాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పన్ను చెల్లించని మద్యంపై 134 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు.మద్యం అక్రమాలపై 14500,1800 425 4868 టోల్ ఫ్రీ నెంబర్ లకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.