గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పౌష్టికాహారం తోనే ఆరోగ్యం
ఆదోని,మే, 11 (అంతిమతీర్పు):-ఆదోని పట్టణంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, యూనియన్, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ సూచించారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్త్రీల చిన్న పిల్లల ఆసుపత్రి లో మాతృ మూర్తులకు గర్భిణీ మహిళలకు మాస్క్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోణ మహమ్మారి నియంత్రణకు మాస్కూలను తప్పనిసరిగా ధరించాలి అన్నారు. ఆరోగ్య కేంద్రాలలో గర్భిణి స్త్రీలు ప్రతి నెల పరీక్షలు నిర్వహించుకోవాలని ఆరోగ్యంగా ఉండాలన్నారు. గర్భిణీలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం తీసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకురాలు లలిత, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పౌష్టికాహారం తోనే ఆరోగ్యం