పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

*08–05–2020*
*అమరావతి*


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


*అమరావతి:*


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:*
*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సహా పలువురు అధికారులు హాజరు.*


*ఉపాధి హామీ పనులు*


కరోనా కారణంగా ఉపాధి హామీ పనులు మందగించాయన్న అధికారులు
భౌతిక దూరం పాటిస్తూ పనులు మొదలుపెట్టామని, ఇప్పుడిప్పుడే పనులు వేగం అందుకున్నాయన్న అధికారులు
వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలన్న సీఎం
ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలన్న సీఎం


*గ్రామాల్లో అభివృద్ధి*


గ్రామాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతిని వివరించిన సీఎం.
గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యమైనవి: సీఎం
వీటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది: సీఎం


16,208  వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదించిన అధికారులు.
పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని వెల్లడి.
*పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని వెల్లడి*
గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31 కల్లా  పూర్తి చేయడానికి యత్నిస్తున్నామన్న అధికారులు
మార్చి 31, 2021 కల్లా రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామన్న అధికారులు.