నేటి నుండీ తిరిగి తెరుచుకోనున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

*ఆంధ్రప్రదేశ్*


_*నేటి నుండీ తిరిగి తెరుచుకోనున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు*_


★ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


★ మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. 


★ భౌతిక దూరం పాటిస్తూ కార్యాలయాల్లో విధుల్లో పాల్గొనాలని సూచనలు ఇచ్చింది. అలాగే రిజిస్ట్రేషన్‌కి వచ్చే వారికి సీరియల్‌ ప్రకారం భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  


★ లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


★ దీనిప్రకారం రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేయాల్సి ఉంటుంది. 


★ ఇప్పటికే అమరావతిలో సచివాలయ ఉద్యోగులు ఇవాళ విధులకు హాజరయ్యారు. మూడో వంతు సిబ్బందితో సచివాలయం సహా ప్రభుత్వ  కార్యాలయాలన్నీ పని చేయనున్నాయి.