సొంత ప్రదేశాలకు బయలుదేరిన చత్తీస్ గడ్ భక్తులు

సొంత ప్రదేశాలకు బయలుదేరిన చత్తీస్ గడ్ భక్తులు .....            ఏ.ఎస్.పేట, మే 13 (అంతిమ తీర్పు) :        .మండల కేంద్రం యాత్రా స్థలమైన ఏఎస్ పేట  దర్గా దర్శనానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా గత 50 రోజుల నుండి ఇక్కడే చిక్కుకున్న చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన భక్తులను ఎట్టకేలకు అధికారులు వారి సొంత రాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా ఎఎస్ పేట నుండి గుంటూరు వరకు 34 మంది చత్తీస్గఢ్ వాసులను ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి గుంటూరు నుండి ట్రైన్లో వారి స్వర ప్రదేశాలకు వెళ్లే ఏర్పాట్లను అధికారులు చేశారు ఏది ఏమైనా తమ సొంత ప్రదేశాలకు వెళ్తున్నామన్న ఆనందం వ్యక్తం చేసిన భక్తులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏవో ఎంపీడీవో కార్యాలయ ఏవో శ్రీనివాసులు ఎస్ఐ గోపాల్ ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ సహాయకులు సులేమాన్ తదితరులు పాల్గొన్నారు