కాసులకు కక్కుర్తి పడి ప్రజల జీవితంతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.:భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి చాగర్లమూడి

"కాసులకు కక్కుర్తి పడి ప్రజల జీవితంతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.:భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి చాగర్లమూడి


గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారే ప్రమాదం.


ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మకాలు తక్షణం నిలిపివేయాలి.."


   అమరావతి మే6 (అంతిమ తీర్పు) :  భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి చాగర్లమూడి లిక్కర్ షాపుల ముందు గుమికూడిన జనం తోపులాటలు చూస్తుంటే లాక్ డౌన్ పేరిట ప్రజలు  40 రోజుల పడిన శ్రమ వృధా అయ్యేలా కనిపిస్తోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి చాగర్లమూడి ఆందోళన వ్యక్తం చేశారు. 


మద్యం షాపులవద్ద ఎక్కడా భౌతిక దూరం పాటించటంలేదని అన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలల్లో  
మద్యం షాపుల వద్ద  గుమిగూడిన జనాన్ని చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.


ప్రభుత్వ తీరువల్ల కొరొనా వైరస్ మరలా విజృంభించే ప్రమాదం ఉందని అన్నారు. 


 కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేసి ప్రజలు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఆబ్కారీ ఆదాయం కోసం ప్రభుత్వం ఇలా దిగజారడం గర్హనీయమన్నారు.


 ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతోందన్నారు. నిత్యావసరాలు అందించే దుకాణాలను సైతం నిర్ణిత  సమయం వరకే అనుమతించి తర్వాత బలవంతమగా మూయించిన ప్రభుత్వం మద్యం విషయంలో మాత్రం బరితెగించి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 


మద్యం షాపుల ముందు బారులు తీరినవారంతా పేద మధ్యతరగతి వాళ్ళేనని  వారంతా అప్పులు చేసో, వస్తువులు తాకట్టు పెట్టో మద్యం దుకాణాలకు వస్తున్నారని వాళ్ళ ను ప్రభుత్వం అధిక ధరలతో దోపిడీ చేస్తోందని విమర్శించారు.


 పేదలు, కార్మికులు, వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ఆదాయం కోసం మందుబాబులు కోరిక తీర్చేందుకు మాత్రం తహతహ లాడుతోందని అన్నారు. 


మద్యం షాపులు ముందు  భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని  అన్నారు. 


రెడ్ జోన్ లో అమ్మకాలు నిలిపివేసిన ప్రభుత్వం అక్కడి వారిని నియత్రించలేకపోతోందని వారంతా ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో స్వేచ్ఛగా తిరుతున్నారని  ఆరోపించారు. 


మద్యం దుకాణాల పేరిట జోన్ల వ్యవస్థ చెరిగిపోయి కరోన సామూహిక వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని  అన్నారు.


 ప్రభుత్వం అసంబద్ధ విధానాలు, అవగాహనా రాహిత్యంతో ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తోందని ఆరోపించారు. 


కొరొనా నియంత్రణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం  తక్షణం మద్యం దుకాణాలు మూసి వేయాలని  డిమాండ్  చేశారు.