........................................
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తవేజులు
ఇవి కావోయ్ చరిత్ర కర్థం
ఈ రాణి ప్రేమ పురాణం
ఆ ముట్టడికైన ఖర్చులు
మతలబులు, కైఫీయతులు
ఇవి కావోయ్ చరిత్రసారం.
ఇతిహాసపు చీకటికోణం
అట్టడుగున పడి కన్పించని
కథలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం.
నైలునది నాగరికత లో
సామాన్యుని జీవన మెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహాసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్
అది మోసిన బోయీలెవ్వరు?
.........................................
-------- శ్రీశ్రీ