పేద ప్రజల ఆకలి తీరుస్తున్న రాంబాబు

పేద ప్రజల ఆకలి తీరుస్తున్న రాంబాబు


 *నిడమర్రు గ్రామంలో లాక్ డౌన్ ప్రారంభం నుండి తన సొంత ఖర్చులతొ  పేద ప్రజలకు ప్రతి రోజు అన్నం వండి తీసుకొని వారి ఇళ్ళకు వెళ్ళి ఇస్తూ పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అన్న దాత


 పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం నిడమర్రు గ్రామంలొ  కరోనా  వలన *లాక్ డౌన్* ప్రకటన చేసిన మూడవ రోజు నుండి నిడమర్రు గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ గ్రామానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామంలో సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరికి ఫేస్ మాస్కూలు పంపిణీ చేయడం జరిగింది,ఇలానే బ్లీచింగ్ చిమ్మించడం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రెండవ విడతగా తిరిగి మాస్కులు‌ పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు రోజుకి 150 మందికి పైగా  భోజనం వండించి గ్రామంలొ ఉన్న పేద వారి ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా రాంబాబు సొంత ఖర్చులతో చేయడం జరిగింది.ప్రతిరోజు గ్రామంలొ ఉన్న ముసలి వారికి అన్నం ఇచ్చిన తరువాత వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవని జాగ్రత్తలు పాటించాలని  చెప్పి బయటకు రాకుండా ఉండమని సూచనలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన  విదంగా లాక్ డౌన్ మే మూడు వరకు భోజనాలు ఇలానే కొనసాగింపు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని సంకెళ్ళరాంబాబు అన్నారు. పేదవారి  ఆకలి తీర్చే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉందని ఈ సమయంలో ఇలాంటి మంచి అవకాశం నాకే దక్కిందని‌ రాంబాబు అన్నారు.