ఎటువంటి సడలిపులు లేవు...రోడ్ల పైకి వచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు.....కలెక్టర్ ఇంతియాజ్

ఇంటి పట్టునే ఉండండి.. సురక్షితులు కండి...                            నగరంలో ఎటువంటి సడలిపులు లేవు...రోడ్ల పైకి వచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు.....కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ,తేదీ.5.5.2020:  విజయవాడ నగరంలో లాక్ డౌన్ అమలులో ఎటువంటి మినహాయింపులు లేవని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.లాక్ డౌన్ లో సడలింపులు ఉన్నాయని కొంతమంది  రోడ్ల పైకి వస్తున్నారని, అలా వస్తే తప్పని సరిగా క్వారంటైన్ సెంటర్ కు వెళ్ళవలసి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కంటైన్మెంట్ జోన్సలో నిబంధనలు చాలా పటిష్టం గా అమలు చేస్తున్నామని,దీనిని మరింతగా కట్టడి చేస్తామన్నారు.నగరంలో లాక్ డౌన్ అమలులో ఎటువంటి సడలిపులు లేవని,దయచేసి ఎవరు బయటకు రావద్దని సూచించారు. బయటకు వచ్చి ఇబ్బందులకు గురికావద్దని హితవుపలికారు. కొద్దీ రోజుల పాటు ఓపిక పాటిస్తే కరోనా పారత్రోలవచ్చాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.కంటైన్మెంట్ క్లస్టర్ లో ఉన్నవారంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ లో నూరు శాతం రిజిస్ట్రేషన్ చేయుంచుకోవాల్సిందే నన్నారు. క్లస్టర్ల విభజనకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని ఆ ప్రకటన లో కలెక్టర్  ఇంతియాజ్ తెలిపారు.ఆ మేరకు


 జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం  క్లస్టర్లను గుర్తించిందన్నారు. గడిచిన 5 రోజుల్లో కేసులు రికార్డయితే అది వెరీ యాక్టివ్‌ క్లస్టర్‌గాను, గడిచిన 6 నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైనా( 5 రోజుల్లోగా కేసులు లేకపోతే) వాటిని  యాక్టివ్‌ క్లస్టర్‌ గాను  గడిచిన 15 నుంచి 28 రోజుల్లో కేసులు నమోదైనా ( 15 రోజుల్లోగా కేసులు నమోదు కాకపోతే ) వాటిని  డార్మంట్‌ క్లస్టర్‌ గాను, 28 రోజులుగా కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్ గాను గుర్తిస్తా మన్నారు.


ఒక గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రీన్ నుంచి రెడ్ జోన్ కి , రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి అనుమతులు ఇవ్వడం జరగదన్నారు.


కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పాజిటివ్‌ కేసు ఉన్న ఇంటి నుంచి ప్రారంభమై 500 మీటర్ల నుంచి 1 కి.మీ వరకూ 3 కిలోమీటర్ల వరకూ బఫర్‌ జోన్‌  (కేసు ఉన్న ఇంటి నుంచి దూరంతో కలుపుకుని)  కేసుల సంఖ్య, కాంటాక్ట్స్, తీవ్రతను బట్టి జిల్లా అధికారులు పరిధిని నిర్ణయిస్తామన్నారు.


. అర్బన్‌ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ కాలనీలు, మున్సిపల్‌ వార్డులు వారీగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు,  కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌కు సమీపంలో ఉన్న వార్డులు, కాలనీల్లో సర్వేలెన్స్‌ కొనసాగుతుందన్,  రూరల్‌ ప్రాంతాల్లో పంచాయతీల ప్రాతిపదికన కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ కేసులు, కాంటాక్టులను బట్టి అధికారులు దీనిచుట్టూ పరిధిని పెంచే అవకాశం ఉంటుంది. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో బారికేడ్లతో రోడ్ల మూసివేతతో పాటు అన్నిరకాల కదలికలు నిషేధం. నిత్యావసరాలకు ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారన్నారు.. వీలైనంత వరకూ ఇంటివద్దకే నిత్యావసరాల పంపిణీ చేస్తామని, 
కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వద్దకే మొబైల్‌ వాహనాలతో నిత్యావసరాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. వ్యక్తుల కదలికలన్నీ రికార్డు చేస్తామని, ప్రతి కుటుంబం ఆరోగ్యపరిస్థితులపై సంపూర్ణంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. కేసులు వారి కాంటాక్టుల వివరాలను 12, 24 గంటలకోసారి అప్‌డేట్‌ చేస్తారని, వైరస్‌ సోకినవారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్‌కు తరలిస్తారన్నారు. హై రిస్క్‌ ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రోటోకాల్‌. మంచి వైద్యం కోసం తరలిస్తారు.  .


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు