సొంత రాష్ట్రానికి చేరిన వలస కూలీలు

**సొంత రాష్ట్రానికి.  చేరిన వలస కూలీలు.
**గారికాపాడు చెక్ పోస్ట్ వద్ద వలస కూలీలకు స్వాగతం పలికి   ఆహ్వానించిన, ప్రభుత్వ విప్  జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను  SP  రవీంద్రనాథ్ IPS., 
------------------------------------------------


 *గుజరాత్ రాష్ట్రం నుండి గరికపాడు చెక్పోస్ట్ ద్వారా 12 బస్సులలో రాష్ట్రానికి చేరిన 887 మంది మత్స్యకారులు* 
 *
**వారికి స్వాగతం పలికిన జగ్గయ్యపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు,జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు, పిడిడిఆర్డిఎ శ్రీనివాస్ గారు ప్రభుత్వ యంత్రాంగం**
 
 *మొత్తం 12 బస్సులలో 887 మంది రాక* 


 *శ్రీకాకుళం 700 మంది* 


 *విజయనగరం 98 మంది* 


 *విశాఖపట్నం 77 మంది* 


 *తూర్పుగోదావరి ఐదు మంది* 


 *ఒడిశా రాష్ట్రం ఆరు మంది ,చత్తీస్గడ్ ఒకరు.*


 *చెక్ పోస్ట్ వద్ద మత్స్యకారులకు అల్పాహారం త్రాగునీరు అందించిన పోలీసు అధికారులు*


 _ఎస్పీ గారు మాట్లాడుతూ_ .......


**ఉత్తరాంధ్ర నుండి  వివిధ పనుల నిమిత్తం మత్స్యకార కుటుంబాలు గుజరాత్ రాష్ట్రానికి వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నారని**


**లాక్ డౌన్అమలు నేపథ్యంలో  రాష్ట్రం నుండి అక్కడకు వెళ్లి, చిక్కుకుపోయిన మత్స్యకారుల సంరక్షణార్థం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మత్స్యకార మంత్రిగారు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న కష్టాలను చూసి గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు**


**ప్రభుత్వం వారు నిర్వహించే వైద్య పరీక్షలకు అందరూ సహకరించాలని తెలిపారు**


*ముఖ్యమంత్రిగారి గారి చొరవ వల్ల అక్కడ చిక్కుకున్న 4400  మందిని రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు**


*వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాష్ట్రాలను దాటుకుని మొదటి విడతగా 12 బస్సులు రావడం జరిగిందన్నారు**


**12 బస్సులో వచ్చిన 887 మందిని ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు పోలీసు యంత్రాంగం ఆహ్వానించడం జరిగింది అన్నారు.వారికి ఆహారం, త్రాగు నీరు అందించి, వారి వారి ప్రాంతాలకు పోలీసు బందోబస్తు ఎస్కార్టుతో  పంపించడం జరుగుతుంది అన్నారు.వచ్చిన మత్స్యకార కుటుంబాలను వారి వారి ప్రాంతాలకు ఈరోజు సాయంత్రం లోపు పంపించడం జరుగుతుంది.వీరిలో ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.అవసరం మేరకు వారిని quarantine సెంటర్లకు పంపి వైద్య అందించడం జరుగుతుంది.వారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉంటే వారిని హౌస్ ఖ్వారంటైంన్ కు పంపించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు, నందిగామ డిఎస్పీ రమణ మూర్తి గారు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్ గారు, జగ్గయ్యపేట CI నాగేంద్ర కుమార్ గారు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.