-: మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ అభ్యర్థులకు తీరని అన్యాయం .* :M Naga madhu yadav., NSUI State President AP
*మెడికల్ పీజీ అడ్మిషన్ల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న జీవో నెంబర్ 43 రూపొందించినది .
*ప్రభుత్వం రూపొందించిన ఈ జీవో రాజ్యాంగ స్ఫూర్తికి,సుప్రీం కోర్టు తీర్పులకు , రిజర్వేషన్ల విధానానికి పూర్తిగా విరుద్ధం .
*జీవో నెంబర్ 43 మేరకు మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వ్డ్ కేటగిరీ కి చెందినటువంటి అభ్యర్థి ఓపెన్ మెరిట్ లో ఒక స్పెషలైజేషన్లో ప్రవేశం పొంది అదే స్పెషలైజేషన్లో మరొక కళాశాలకు రిజర్వ్ కేటగిరీలో కి స్లైడ్ అయితే అతడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీ కి చెందిన అభ్యర్థి తో భర్తీ చేస్తారు.
*కానీ రిజర్వ్డ్ కేటగిరీ కి చెందిన అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఒక కళాశాలలో సీటు పొంది అదే కళాశాలలో కానీ లేదా ఇతర కళాశాలలో కానీ మరొక స్పెషలైజేషన్ లోకి slide అయితే అతడి పూర్వపు సీటును ఓపెన్ కేటగిరీ అభ్యర్థి చేత భర్తీ చేస్తారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం ,రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం .
*ఇక్కడ మనకు ఒక విషయంపై స్పష్టత రావాల్సి ఉంది మెడికల్ యూజీ (MBBS)సీట్లలో సారూప్యత ఉండడంవల్ల అభ్యర్థి కళాశాల కు ప్రాధాన్యత ఇస్తాడు. కానీ పీజీ అడ్మిషన్లలో కళాశాల కన్నా అభ్యర్థి స్పెషలైజేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తాడు .
*రిజర్వుడు అభ్యర్థి అదే స్పెషలైజేషన్ కు స్లైడ్ అయితేనేఆ సీటును అదే రిజర్వేషన్ కు సంబంధించిన అభ్యర్థిఅభ్యర్థికి కేటాయిస్తాము కానీ వేరే స్పెషలైజేషన్ కు మారితే అతడి సీటును ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తాము అనే కుట్రపూరిత నిబంధనలు రూపొందించారు .
*ఈ నిబంధనతో రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులు వందలాది సీట్లు కోల్పోతున్నారు .ఇది ఖచ్చితంగా ఉన్నత కులాల వారి కుట్ర .పేద మధ్యతరగతికి చెందిన రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడంలో భాగము.
*ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం OBC లనుమరో విధంగా మోసం చేస్తోంది. OBC ల పట్ల వివక్ష చూపుతూ వైద్య విద్యకు దూరం చేస్తూ ఉన్నది .రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లోని 50 శాతం PG సీట్లను నేషనల్ పూల్ కు బదలాయించారు. ఈ సీట్లను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పూల్ లోని సీట్లను OBC లకు కేటాయించడం లేదు దీని ద్వారా ప్రతి సంవత్సరం OBC లు దాదాపు 5 వేల పీజీ మెడికల్ సీట్ల నష్టపోతున్నారు.ఒకవైపు కేంద్ర ప్రభుత్వం OBC రిజర్వేషన్లు అమలు పరచక బీసీలకు నష్టం కలగ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయి .
*ఒకవైపు సుప్రీంకోర్టు 16. 9. 1992 ఇందిరా సహాని కేసు లో ,
15.2.1996 రితేష్ R షా కేసులో,
11.01. 2018 త్రిపురారి శరణ్ కేసులో ,
ఓపెన్ కేటగిరీలో సీటు సాధించిన రిజర్వుడు అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ గానే పరిగణించాలి కానీ రిజర్వ్ అభ్యర్థిగా చూడకూడదు .దీని వల్ల 50 శాతం రిజర్వేషన్లు అదిగమనించినట్టు కాదు అని పలుసార్లు స్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్పులను పరిగణలోకి తీసుకోవడం లేదు.
* బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వం గా చెప్పుకునే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి జీవో నెంబర్ 43 రద్దు చేసి త్వరలో జరగబోయే మెడికల్ పీజీ కౌన్సిలింగ్ లో రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి .
*ఓపెన్ కేటగిరీలోఒక స్పెషలైజేషన్లో సీటు సాధించిన రిజర్వుడ్ అభ్యర్థి అదే స్పెషలైజేషన్ కు కానీ లేదా వేరే స్పెషలైజేషన్ కు కానీ అదే కళాశాలలో కానీ లేదా వేరే కళాశాలకు కానీ స్లైడ్ అయితే అతడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థి తోనే భర్తీ చేయాలి.సుప్రీంకోర్టు 11 .1. 2018 లో త్రిపురారి శరణ్ కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలి .
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేయకపోతే రిజర్వేషన్ వర్గాలకు చెందిన మంత్రులను, నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారిని తమ పదవులకు రాజీనామా చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీలకు చెందిన ప్రజల హక్కుల కొరకు పోరాడాలి అని డిమాండ్ చేస్తున్నాం.
నమస్కారములతో........... M Naga madhu yadav. NSUI State President AP