ఏ.పి.టి.యఫ్ ఉపాధ్యాయ సంఘంచే కూరగాయలు పంపిణీ

ఏ.పి.టి.యఫ్ ఉపాధ్యాయ సంఘంచే కూరగాయలు పంపిణీ


వింజమూరు, మే 5 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు మంగళవారం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నేతలు కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు యం.వి.కే సుధాకర్ రావు మాట్లాడుతూ వింజమూరు మండలంలో లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు దాతలు ఎంతగానో సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు.  పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో పాటు పేదలను ఆదుకునేందుకు ఉపాధ్యాయులు సైతం ముందుకు వస్తుండటం పట్ల తహసిల్ధారు ఉపాధ్యాయులను పేదల పాలిట ఆపద్భాందవు లాంటి వారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి, ఏ.పి.టి.యఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావూరి.సుధాకర్ రెడ్డి, ఏ.పి.టి.యఫ్ మండల శాఖ అధ్యక్షులు జక్కం.మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి.కొండారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు యం.శ్రీనివాసులురెడ్డి, జి.నారాయణ, ఎస్.కే.మదార్, పి.బసిరెడ్డి, లెక్కల.రవి తదితరులు పాల్గొన్నారు.