జలదంకి లో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంపిచికారి

*సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంపిచికారి..


జలదంకి ,మే 2     (అంతిమ తీర్పు) :     మండల కేంద్రమైన జలదంకి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులకు వై, ఎస్ ఆర్.సిపి,మండల కన్వీనర్ దగుమాటి మాల్యాద్రిరెడ్డి శ్రీకారం చుట్టారు, పంచాయతీలోని ప్రతి వీధిలో రోడ్లపై సోడియం హైపోక్లోరైడ్  ద్రావణాన్ని పిచికారి చేయించారు, పారిశుద్ధ్య కార్మికుల చేతకాలువల్లో మురుగునీరు, పూడికను  తీయించి బ్లీచింగ్ చల్లే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పై గ్రామంలోని ప్రజలందరూ జాగ్రత్త వహించాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని, రైతులు పొలం పనులకు వెళ్లేటప్పుడు సామాజిక దూరాన్ని పాటించి పనులు చేసుకోవాలని, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శరీర భాగాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు, ప్రతి ఒక్కరూ మాస్క్ లను తప్పనిసరిగా ధరించి కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలన్నారు, ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూరపాటి మాలకొండారెడ్డి, తిప్పారెడ్డి ఎదునందన్ రెడ్డి, ఇస్కా మదన్ మోహన్ రెడ్డి, సురె శేషారెడ్డి, కోర్సిపాటి రామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నార