తూర్పు బోయమడుగుల కు మహర్దశ

తూర్పు బోయమడుగుల కు మహర్దశ
వరికుంటపాడు మే 11:


వరికుంటపాడు మండలం లో వెనుక బడిన పంచాయతీ గా పేరున్న తూర్పు బోయమడుగుల కు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. పిల్లాపెరు వాగు కి మోటార్ లు బిగించి వ్యవసాయం చేసుకునే రైతులకు కొంత ఉపశమనం కలగనుంది. పంచాయతీ నడిబొడ్డున రూ 35 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మిస్తుండటం,  సుమారు 20 లక్షలతో రైతు భరోసా కేంద్రo మంజూరు కావడం, రూ 13 లక్షల వ్యయం తో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరు కావడం విశేషం. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం కు గ్రామం కు పడమర వైపు ఉన్న పిల్లపెరు వాగు ను దాటి పొలాలకు వెళాల్సిన పరిస్థితి ఉంది. వర్షకాలం వస్తే రైతులు ఇబ్బంది పడేవారు. అయితే జి  కొండారెడ్డి పల్లి నుండి తూర్పు బోయమడుగుల మీదుగా మండల కేంద్రమైన వరికుంటపాడు కి వెళ్లేందుకు సుమారు 13 లక్షలతో రోడ్డు కూడా మంజూరు అయింది. ఈ రోడ్డు కి అంతర్భాగం గా పిల్లపెరు పై చప్టా నిర్మించనున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ పంచాయతీ కి మూడు చోట్ల ఇంటి నివేశన లేవుట్ లు ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు వర్గాలు ఎక్కువ ఉన్న ఈ గ్రామం లో ఇంటి స్థలాల లేవుట్ వలన ఆర్థికంగా ధైర్యo ఏర్పడినట్టు అయింది. శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పంచాయతీ ని అభివృద్ధి వైపు నడిపిస్తుండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.