కంటైన్మెంట్ జోన్ ప్రజలకు  ప్రభుత్వం తరపున  RDT సమకూర్చిన మాస్క్ ల పంపిణీ - డీజీపీ గౌతమ్ సవాంగ్

కంటైన్మెంట్ జోన్ ప్రజలకు  ప్రభుత్వం తరపున  RDT సమకూర్చిన మాస్క్ ల పంపిణీ - డీజీపీ గౌతమ్ సవాంగ్


అమరావతి, మే 5(అంతిమ తీర్పు) : అనంతపురం కు చెందిన
విన్సెంట్  ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థ అనంతపురం కేంద్రంగా  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుపేదల అభివృద్ధికి గత 50 సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సంస్థ ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో   భాగంగా తమవంతు సహాయంగా రాష్ట్ర డీజీపీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి   150,000 మాస్క్ లను అందించడం జరిగింది. తాము అందించిన మాస్క్ లను పోలీస్ శాఖ సహకారంతో  కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ప్రజలకు అందజేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీ గారిని  కోరడంతో, మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు సదరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారు, విపత్కర పరిస్థితులలో సహాయ సహకారాలను అందిస్తున్న ట్రస్ట్ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున, పోలీసు తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితులలో ఇటువంటి సాయం పలువురికి స్ఫూర్తిని కలిగిస్తుందని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో Add.DG L&O రవిశంకర్ అయ్యనార్, Add DG Welfare శ్రీ శ్రీధర్ రావ్, IG, పీ & ఎల్ శ్రీ నాగేంద్ర కుమార్, మహేష్ చంద్ర లడ్డ లతో పాటు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు ప్రమీల కుమారి, రామేశ్వరి, సౌజన్య మరియు రామారావు పాల్గొన్నారు.


 *కంటైన్మెంట్ జోన్లలో పర్యటన:* 


డీజీపీ సవాంగ్  , సీపీ ద్వారకా తిరుమల రావు   కలెక్టరు ఇంతియాజ్ , మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ , కృష్ణ లంక, కార్మిక నగర్ ఏరియా లను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా, వాలంటీర్ లకు RDT సమకూర్చిన మాస్క్ లను అందచేసి,  అక్కడి ప్రజలకు పంపిణీ  చేయవలసిందిగా నిర్దేశించారు. అక్కడ ప్రజల  సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు