కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపు పై ఆందోళన....

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపు పై ఆందోళన....


కావలి ,మే ,15 (అంతిమ తీర్పు-N. సాయి )


కావలి పట్టణం నందు  రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ sanghat స్టేట్ కో కన్వీనర్ జి కిరణ్ ఆదేశాలతో మరియు జోనల్ కోఆర్డినేటర్ కమల్ సూచనలతో నెల్లూరు జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ కోఆర్డినేటర్ వి శివ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపుపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘ కోఆర్డినేటర్ వెంకయ్య మరియు ప్రసాద్ పాల్గొని కావలి ఎలక్ట్రికల్ డి.ఈ  కె భాస్కర్ రెడ్డి కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో  శివ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 50 రోజుల నుంచి దేశ ప్రజలందరికీ ఈ మహమ్మారి నుండి కాపాడుటకు ఇళ్లలోనే లాక్ డౌన్లో చేసి బడుగు బలహీన ప్రజలకి మరియు అనేక రకములైన కార్మికులకు పని లేక పూట గడవటమే కష్టం గా ఉండే తరుణంలో ప్రజల మీద మోయలేని భారాన్ని కరెంటు  రూపం నా  గోరుచుట్టుపై రోకలి పోటు అనుసంధాన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది అని మార్చి ఏప్రిల్ మే నెల బిల్లు పూర్తిగా మాఫీ చేయాలని జూన్ నుండి పాత విధానంలో పాత రేట్లతో కరెంటు బిల్లులు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది డిమాండ్ చేస్తుంది అన్నారు. అలా కాని పక్షంలో ప్రజల పక్షాన ఉండి కరెంటు బిల్లులు తగ్గేవరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం