ఇంగ్లీష్ మీడియం పై SCERT ఇచ్చిన రిపోర్ట్ ను అధ్యయనం చేసిన పాఠశాల విద్య కమిషనర్ 

*అమరావతి*


ఇంగ్లీష్ మీడియం పై SCERT ఇచ్చిన రిపోర్ట్ ను అధ్యయనం చేసిన పాఠశాల విద్య కమిషనర్ 


SCERT ఇచ్చిన సూచనలు పరిగణం లోకి తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరిన కమిషనర్


మైనారిటీ పాఠశాల లు ఎదావిదిగా కొనసాగించిచ్చు అని పేర్కొన్న కమిషనర్ 


ఒకవేళ అక్కడ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం కోరితే.... ప్రత్యేక సెక్షన్ లో ఏర్పాటు చేయాలని సూచన


1797168 మంది విద్యార్థుల్లో కేవలం 53947 మంది మాత్రమే తెలుగు మీడియం కి మొగ్గు


కోరిన ప్రతి చోటా తెలుగు మీడియం ఏర్పాటు సాధ్యం కానందుకు మండలానికి ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని పేర్కొన్న కమిషనర్ 


మొత్తం 672 మండల కేంద్రాల్లో తెలుగు మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచన 


తెలుగు మీడియం కోరిన విద్యార్థులకు ఉచిత రవాణా, లేదా అందుకు ఖర్చయ్యే మొత్తాన్ని విద్యార్థులకు చెల్లించాలని పేర్కొన్న కమిషనర్


ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.... ప్రభుత్వంపై కేవలం 32 కోట్ల రూపాయల భారం


SCERT ఇచ్చిన నివేదికను అంగీకరించాలని ప్రభుత్వాన్ని కోరిన పాఠశాల విద్యా కమిషనర్


SCERT రిపోర్టును అంగీకరించడంతో పాటు, పాఠశాల విద్యా కమిషనర్ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు


సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పు ప్రకారమే ఇంగ్లీష్ మీడియం పై తుది నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం