జనం మెచ్చిన ఝాన్సీరాణి కర్తవ్యంలో రాజీలేని  డేరింగ్    అధికారిని .

జనం మెచ్చిన ఝాన్సీరాణి ...


కర్తవ్యంలో రాజీలేని  డేరింగ్    అధికారిని ...


       కావలి మే 7,( అంతిమ తీర్పు) :   క్రమశిక్షణ ,సిన్సియారిటీకి ఆమె వారసురాలు...కొలువుతీరిన ప్రతిచోట ఆమెకు ప్రశంసలు... విధి నిర్వహణలో నిక్కచ్చితనం ఆమె సొంతం.. అవినీతి పరుల గుండెల్లో ఆమె ఝాన్సీ రాణి ..ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా రాజీ పడని నైజం ఆమె వ్యక్తిత్వం.... నిజాయితీకి చిరునామా ఆమె నడవడిక.. విధి నిర్వహణలో ఎన్ని  ఆటంకాలు ఎదురైనా చలించని  పోరాటతత్వం ఆమె నైజం ...
నిబంధనలు ఉల్లంఘిస్తే ఆమె లాఠీకి చెబుతోంది పని.. అక్రమంగా సారా కాసే వారిపై తన పంజా దెబ్బ  విసురుతుంది... ఉక్కుపాదం మై అవినీతిపరుల గుండెల్ని చిలుస్తుంది.. నిరంతరం కొలువే జీవితమై  శ్రమిస్తోంది...ఆమె ఎవరో కాదు... కావలి జనం మెచ్చిన ఝాన్సీ రాణి ... ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ లో  సీఐగా  విధులు నిర్వహిస్తున్న నిజాయితీ మారుపేరుగా నిలిచిన అధికారి అరుణ కుమారి... అవినీతిపరులపై లాఠీ రులిపిస్తున్న , ఆ డేరింగ్ అధికారిపై  ఓ ప్రత్యేక కథనం...2009  బ్యాచ్ కు చెందిన అరుణకుమారి ఏ పిపిసి  గ్రూప్2 లో సెలక్ట్ అయి తొలుత  ప్రకాశం జిల్లా దర్శిలో ప్రొహిబిసిషన్ ఎక్ససెజ్ లో  యస్.ఐ గా ఉద్యోగంలో చేరారు. అక్కడ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించడంతో అటు ప్రజలు ఇటు అధికారులనుంచి మన్ననలు పొందారు. ఆ తరువాత ,సింగరాయకొండ, పొన్నూరులలో విధి నిర్వహణ చేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కొలువు చేసిన ప్రతి చోట ప్రజలు నుంచి ఆమె ప్రశంశల అందుకొంది. క్రమశిక్షణ,నిజాయితీగా పనిచేయటంతో  ఆ శాఖ అధికారులు నుంచి కితాబులు అందుకొంది. అనంతరం 2018 వ సంవత్సరం లో  పదోన్నతి పై కావలి సిఐగా అడుగుపెట్టారు. అప్పుడు నుంచి కావలిలో విధులు నిర్వహిస్తు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. రాజీకీయక నాయకుల వత్తిళ్ళకు నెరవక  విధి నిర్వహణ చేస్తూ శెభాష్ అంటూ ప్రజల చేత ప్రశంసలు అందుకొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో నిక్కచ్చిగా విధి నిర్వహణ  చెయ్యడంతో మద్యం నియంత్రణ చెయ్యడంలో సక్సస్ అయింది.కావలి డివిజన్ లో నాటు సారా అరికట్టేందుకు తన వంతు కృషి చేసింది. నాటు సారా తయారీ దారులను పట్టుకొని కేసులు నమోదు చేసింది. రాత్రుళ్ళు గస్తీ పెట్టి కావలి ప్రాంతంలో అక్రమ సారాతయారీదారుల ఆట కట్టించింది. కరోనా వల్ల లాక్ డౌన్ నేపథ్యంలో కావలి డివిజన్ లోని 18 మద్యం దుకాణాలలో  ఎక్కడ అవకతవకలు జరగాకుండా  విధి నిర్వహణ చేసేరు. లాక్ డౌన్ 50 రోజుల్లో మద్యం లేకుండా విధి నిర్వహణ చేసి మంచి అధికారిగా ప్రజల ప్రసంసలు అందుకున్నారు. కరోనా పై బాబులను చైతన్యం చేస్తూ విధి నిర్వహణ చేస్తూoది. అవినీతి పరుల గుండెల్లో ఆమె సింహంలా  వ్యవహారించడంతో కావలి డివిజన్ కు చెందిన ప్రజలు .ముద్దుగా ఝాన్సీలక్ష్మి అని పిలవడం గమనార్హం.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image