మద్యపానాన్ని నిషేధించాలంటూ ఐద్వా మహిళలు వినూత్న రీతిలో నిరసన .

మద్యపానాన్ని నిషేధించాలంటూ ఐద్వా మహిళలు వినూత్న రీతిలో నిరసన ........."


(ఆత్మకూరు అంతిమ తీర్పు ఇంచార్జ్ రహమత్ అలీ)" మద్యాన్ని నిషేదించాలని కరోన నేపథ్యంలో  వైన్స్ షాపులు తక్షణం మూసివేసి మద్యం కష్టాలనుండి మహిళలను కాపాడాలని ఆత్మకూరు ఐద్వా  మహిళలు గంట కొట్టారు  ఆత్మకూరు పట్టణంలో సామాజిక దూరం పాటిస్తూ రోడ్డుపై మహిళలు ప్లేటుని గరిటతో కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆత్మకూరు ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం మాట్లాడుతూ ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనిరసన కార్యక్రమాలు  చేపట్టడం జరిగిందన్నారు ఒకపక్క కరోనాతో ప్రజలు పనులు లేక తినడానికి తిండి లేక అనేక అవస్థలు పడుతున్నా నేపథ్యంలో దాతలు ఇచ్చిన సరుకులతో కాలం వెళ్లబుచ్చుకుంటున్న కష్టకాలంలో మందు షాపులను తెరవడంతో ఇండ్లల్లోని వస్తువులను తాకట్టు పెట్టి తాగుతున్నారని ఆవేదన వెక్తపరిచారు ఇకనైనా ముఖ్యమంత్రి సంపూర్ణ మద్యపాననిషేదం హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు