ఎపి స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.వి. విద్యాసాగర్  సస్పెన్షన్

*అమరావతి*


ఎపి స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.వి. విద్యాసాగర్  సస్పెన్షన్


సిఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచితమైన పోస్ట్ చేశారంటూ చర్యలు


సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ‌ చేసిన ఎపి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, సిఐడి చీఫ్ పి.వి. సునీల్‌కుమార్


 దుష్ప్రవర్తన,  క్రమశిక్షణ,  సెక్షన్ 25 ను ఉల్లంఘించినందుకు  సస్పెండ్ చేసినట్లు మీడియా ప్రకటన


*సునీల్ కుమార్  ఏపి సిఐడి‌ చీఫ్*
 
 డిఇఇ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు


  సిఎంను అసభ్య భాషలో దూషిస్తూ,  ఎపి ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూపులలో విమర్శించారు


మా విచారణ లో ఆధారాలతో సహా అన్నీ వాస్తవం అని తేలాయి


ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. 


 అతిక్రమిస్తే  AP ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలను తీసుకుంటాం