03.05.2020
ప్రపంచమంతా కరోనాకి మందు తయారు చేస్తుంటే జగన్ మద్యం తయారీ చేస్తున్నారు
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఎవరూ వెళ్లొద్దు అని స్పష్టం గా చెప్పిందంటే రాష్ట్రంలో ఎంత భయానక పరిస్థితి ఉందో అర్ధమవుతోంది
.. ...........కళా వెంకట్రావు
ప్రపంచమంతా కరోనా నివారణకు మందు తయారీ చేసే పనిలో ఉంటే జగన్ మాత్రం తన కమీషన్ల కోసం మద్యం తయారీ చేయించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగి నిత్యావసర దుకాణాలే మూసేసే పరిస్థితి ఉంటే...మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటి. మద్యం షాప్ లు ఏమైనా మెడికల్ షాప్ లా? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మద్యం తయారీ చేయాల్సిన అవసరం ఏంటి? మీ జె టాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా? రైతులు పంటలు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, ఆరుగాలం శ్రమించి పండించి న పంటలు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందుల తో అన్న దాతలు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. మరో వైపు కళ్లు గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు . కానీ జగన్ మాత్రం వారి గురించి పట్టించుకోకుండా తన కమీషన్ల కోసం మద్యం తయారీ మీద దృష్టి పెట్టడం సిగ్గుచేటు.
లాక్ డౌన్ లోనూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వైసీపీ నేతలు, వలంటీర్లు అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. వాలంటీర్లు నాటు సారా తయారీ చేస్తున్నారు. వలంటీర్ల కు నెల నెలా జీతాలు ఇచ్చి మరీ జగన్ వారి చేత నాటు సారా తయారీ చేయిస్తున్నారా? జగన్నన్న అమ్మవడి పధకం లా, జగనన్న నాటు సారాతో నోరుతడి పథకం ఏమైనా రాష్ట్రంలో అమలవుతుందా? లాక్ డౌన్ పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దు, మద్యాన్ని ఆర్ధికవనరుగా పరిగణించడం అనైతికత. దశలవారీగా మద్యపాన నిషేధం అన్న జగన్ దశలవారీగా మద్యాన్ని విస్తృతం చేస్తున్నారు.
ఏపీకి ఎవరూ వెళ్ళొద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో ఎంత భయానక పరిస్థితి ఉందొ అర్ధమవుతోంది. కరోనపై వాస్తవాలు దాచి బుగ్గన ప్రజలను మోసం చేస్తున్నారు. బుగ్గన ఆర్ధిక మంత్రా లేక అబద్దాల మంత్రా? ఉపాధి లేక పస్తులుండలేక రాజమండ్రి లో ఒక కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది.దీనికి బుగ్గన ఏం సమాధానం చెబుతారు? ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డాక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు మాట్లాడటం లేదు.ఓ వైపు ఆరోగ్య శాఖ మంత్రి ఏమో ప్రవేట్ డాక్టర్లు 24 గం అందుబాటులో ఉండాలంటారు, మరో వైపు ప్రభుత్వం ఏమో డాక్టర్లు టైమ్ దాటి బయటకు రాకుండా ఆంక్షలు విధించి ప్రవేట్ డాక్టర్లు ను హించిస్తున్నారు.
మద్యం డిస్టరీలు ఓపెన్ చేసి మద్యం తయారు చేయించే బదులు అన్న క్యాంటీన్ లు తెరచి పేదల ఆకలి తీర్చవచ్చు కదా. కరోనా వల్ల ఉపాది లేక పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తో అలమటిస్తున్నారు. జగన్ అన్న క్యాంటీన్లు ఎందుకు రద్దు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఆధునిక యుగంలో కూడా రాష్ట్రం లో పేదలు అర్దాకలితో అలమటిస్తున్నారంటే వైసీపీ నేతలు సిగ్గుపడాలి. పేదలకు పట్టేడన్నం పెట్ట లేని ప్రభుత్వం ఎందుకు? వైసీపీ పాలనలో వైసీపీ నేతల ధన దాహం తీరుతుంది కానీ పేదల ఆకలి మాత్రం తీరడం లేదు. ప్రజలకు రూ. 5 తో 3 పూటలా అన్నం పెట్టలేని జగన్ 3 రాజధానులు ఎలా కడతారో దేవుడికే తెలియాలి.
S/d
కిమిడి కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు