ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా ( ఎన్ యూ జె) జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆనంద్ రాణా నియామకం

ప్రతిష్ఠాత్మక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా ( ఎన్ యూ జె) జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆనంద్ రాణా  నియమితులయ్యారు. 
ఈ మేరకు  ప్రెస్ కౌన్సిల్ అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన ఆనంద్ రాణా  రెండు దశాబ్దాలుగా ఎన్ యు జె లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నియామకం పట్ల ఎన్ యూ జే  అధ్యక్ష కార్యదర్శులు రాస్ బిహారీ, ప్రసన్న మహంతి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  (జాప్ ) అధ్యక్ష కార్యదర్శులు ఎన్ డి వి ఆర్ ఎస్ పున్నం రాజు, యం. యుగంధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు