సీఎం జగన్‌ స్పందన అభినందనీయం: బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.

                      Date: 09/05/2020
సీఎం జగన్‌ స్పందన అభినందనీయం: బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.
అమరావతి : విశాఖపట్నం జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటన మహా విషాదానికి కారణమైన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ వ్యవస్థలన్ని స్పందించిన తీరు అద్భుతమని బీజెపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షణ క్షణం సమీక్షించి స్పందించటం అభినందనీయం అన్నారు.  మృతుల కుటుంబాలకు గాని, బాధితులకు కానీ అందిస్తున్న ప్యాకేజీ ఉహించనిదని ఆయన తెలిపారు. నేనున్నా అని నిజమగానే బాధిత కుటుంబాల మనసుల్లో వైఎస్ జగన్ ఉండిపోయారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు అనాగరికమని వై.వి. సుబ్బారావు మండిపడ్డారు. 
ఎల్‌జీ పాలిమర్స్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, పోలీసులు చమటోడుస్తున్నారని,  ప్రమాద తీవ్రత తెలిసినా ఏమాత్రం లెక్క చేయకుండా పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారని, కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఫోమ్‌ చల్లుతూ పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకొంటున్నారని వీరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో  స్టైరీన్‌ మోనోమర్‌ విషవాయువులీకై 12 మందిని పొట్టన పెట్టుకుందని, వందల మందిని ఆస్పత్రి పాల్జేసిన దుర్ఘటనకు కారణమైన కంపెనీ పై న్యాయవిచారణ జరిపించాలని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు డిమాండ్ చేశారు. మానవ తప్పిదంవలన ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందని, ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ యాజమాన్యం కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించినదని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జీ తో కమిటీ వేచి న్యాయవిచారణ చేపట్టాలని కోరారు.గ్యాస్ ప్రభావానికి గురైన వారు తమ జీవితకాలం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాదితులు అందరూ నిరుపేదలని, వీరు జీవితకాలం వైద్య ఖర్చులు భరించడం కష్టం అయినందున, వీరికి ప్రత్యేక ఆరోగ్య కార్డులు ఏర్పాటుచేసి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు డిమాండ్ చేశారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image