ఎస్.ఐ బాజిరెడ్డికి దళిత సంఘాల నేతల అభినందనలు

*ఎస్.ఐ బాజిరెడ్డికి దళిత సంఘాల నేతల అభినందనలు* వింజమూరు, మే 13 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి జన్మదినోత్సవమును పురస్కరించుకుని బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నేతలు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ.పి యం.ఆర్.పి.ఎస్ నేత బూదాల.ప్రేమదాస్ మాదిగ మాట్లాడుతూ విధి నిఫ్వహణలో భాగంగా ఎస్.ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు అందించిన సేవలు మరువరానివన్నారు. యేడాది వ్యవధిలో ఎస్.ఐ బాజిరెడ్డి నిర్వహించిన కర్తవ్య భాధ్యతలు పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపజేశాయని కొనియాడారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వం మండల ప్రజలను మంత్రముగ్ధులను చేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమోనని ప్రేమదాస్ మాదిగ అభిప్రాయపడ్డారు. ఏ.డి.పి.ఎస్ నేత మూర.పెద్దన్న మాట్లాడుతూ ఎస్.ఐ బాజిరెడ్డి అనతికాలంలోనే మండల ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం గొప్ప విషయమన్నారు. ఆయన జన్మదినోత్సవమును ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని తాము ఆశించామన్నారు. కానీ ఆయన మాత్రం అందుకు అయ్యే ఖర్చుతో పేదలకు అన్నదానం చేయాలని సూచించి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. ఆయన ఆదేశాలను తాము తప్పకుండా పాటిస్తామన్నారు. అందులో భాగంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే కేక్ కట్ చేసి ఎస్.ఐ బాజిరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాం క్షలు తెలియజేయడం జరిగిందన్నారు. మండల ప్రజల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు చూపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఎస్.ఐ బాజిరెడ్డి పది కాలాల పాటు వింజమూరులోనే సేవలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు గుజ్జు.చెన్నయ్య, రామ్మోహన్, తిరిపాలు, పెద్దేటి.చెన్నయ్యలు పాల్గొన్నారు.