ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి వచ్చేందుకు ఎంపీ జీవీఎల్ చొరవ

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి వచ్చేందుకు ఎంపీ జీవీఎల్ చొరవ


కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా బాంగ్లాదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12 మంది వైద్య విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరిలో 11 మంది విద్యార్థినులు ఉన్నారు.


గత 45 రోజుల నుంచి వైద్య విద్యార్థులు బాంగ్లాదేశ్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రసార మాధ్యమాల ద్వారా, కొందరు తల్లిదండ్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు శ్రీ జీవిఎల్ నరసింహారావు గారి దృష్టికి వచ్చింది. కొంతమంది విద్యార్థులు కూడా బంగ్లాదేశ్ నుండి నరసింహారావు గారికి ఈరోజు ఉదయం ఫోన్ చేసి వెనక్కు వచ్చేందుకు సహాయం చేయాలని కోరారు.


విద్యార్థుల సమస్యల గురించి మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరి బాబు గారు కూడా జీవిఎల్ గారి దృష్టికి తీసుకువచ్చారు.


విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం కోసం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ గారితో మరియు బాంగ్లాదేశ్ - ఢాకా లోని భారత్ హైకమిషనర్ శ్రీమతి రివ గంగూలీ దాస్ గారితో శ్రీ జీవిఎల్ నరసింహారావు గారు మాట్లాడారు.


జీవిఎల్ గారు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవడం, కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో విద్యార్థులను తీసుకు రావటానికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగించి వారు మే14 న ఢాకా నుంచి చెన్నై వచ్చేందుకు స్పెషల్ ఎయిర్ ఇండియా విమానంలో సీట్లను ధృవీకరించటం జరిగింది. 


భారతీయ జనతా పార్టీ, రాజ్యసభ సభ్యులు శ్రీ జీవిఎల్ నరసింహారావు గారి కృషి పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.


జీవీఎల్ నరసింహారావు,
రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ అధికార ప్రతినిధి