కష్టం అంటే చాలు ఆమె మనసు చలించిపోతుంది .....
కావలి మే 7 (అంతిమ తీర్పు) : 40వ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, విజయనగరం శ్రీకాకుళం వెళ్ళవలసిన వలస కూలీలకు లాక్ డౌన్ కారణం గా కావలి లో చిక్కుకు పోయారు వీరికి ఎటు వంటి వసతి భోజనం సదుపాయం లేదుక విలవిలలాడుతున్నారు అన్న సమాచారం తెలుసుకున్న జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మాకినేని అరుణ వెంటనే ఆమె హడావిడి గా స్పందించి నేనున్నాను అంటూ వారికి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది . దీనికి ధాత గా వెంటనే స్పందించి ముందుకు వచ్చిన CID INSPECTOR అజాద్ మరియు శంకర్ వాళ్ళకి భోజనం ఇవ్వడం జరిగిందని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు . ఇందులో భాగంగా సభ్యులు , పార్వతి సెంకర్, లక్ష్మి ప్రసన్న యశ్వంత్, వంశీ కృష్ణ మునావర్, చైతన్య, వేణు, ఇలియాజ్ భాగ స్వామ్యం అయ్యారు .