నాని, బోండా ఉమా విజయవాడ కు పట్టిన చీడ పురుగులు : దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

4 -5 -20. విజయవాడ.
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..


*నాని, బోండా ఉమా విజయవాడ కు పట్టిన చీడ పురుగులు*
 *పుష్కరాల సమయంలో చర్చిలు మసీదులు గుళ్ళు పడగొట్టిన ప్రజాద్రోహి కేసినేని నాని అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
*ఎంపీగా విజయవాడకు చేసింది శూన్యం*...
తన ఆర్థిక పెరుగుదలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల ను సైతం మోసం చేసిన వ్యక్తి కేశినేని నాని... 
 
*కబ్జాల నాని, బోండా ఉమా చరిత్ర అందరికీ తెలుసు*...
 తాగి వచ్చి, మద్యం సీసాల తో ప్రెస్ మీట్ పెట్టే బోండా ఉమా ఇంకా ఏమి మాట్లాడగలరు...
వ్యాపారుల వ్యతిరేకి బోండా ఉమా...


టిడిపి అండ్ కో ఎవరికి సాయం చేయరు..
సాయం చేసే వారిపై నిందలు వేస్తారు....
ఎంపీకి 45 రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా. ?
బాబు డైరెక్షన్ లో టిడిపి నాయకులు సేవ ముసుగులో కరోనా వ్యాపింప చేయాలని ఉద్దేశంతోనే ప్రయత్నిస్తున్నారు...
సమాచారం లేకుండా జాగ్రత్తలు పాటించకుండా కూరగాయల పంపిణీ చేసిన ఎంపీ నాని తదితరులపై కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు సమర్థించిన మంత్రి...
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం...
ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల చర్యలను తప్పుబడుతూ ఎంపీ నాని, బోండా ఉమా వ్యాఖ్యలను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఖండించారు..
ఇటీవల 47 డివిజన్ పరిధిలో ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలకు విరుద్ధంగా కనీసం సామాజిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున ప్రజలను జమచేసి ప్రాణాంతకమైన కరోనా వ్యాధి వ్యాపించే విధంగా ప్రవర్తించిన టిడిపి నాయకులు ఎంపీ నాని పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే... 


ఈ విషయంపై మంత్రి  మాట్లాడుతూ కూరగాయల పంపిణి లేదా సేవా కార్యక్రమాలు అనే వంకతో చంద్రబాబు అండ్ కో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారన్నారు..


గత టిడిపి ప్రభుత్వ లో పని చేసిన పోలీసులు ఇప్పుడు పని చేస్తున్నారు.. అప్పుడు మంచి ఇప్పుడు ఎందుకు అయ్యారు...
విమర్శల పై టిడిపి నాయకులకు పొంతన లేదు
ఒకరు 5 కోట్లు అంటే మరొకరు పది కోట్లు...
లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు ఇబ్బంది పడకూడదనే సీఎం జగన్ మోహన్ రెడ్డి  పిలుపుమేరకు నియోజకవర్గంలో  వ్యాపారస్తులు, స్నేహితుల సహకారం తోనే  ఒక లక్షా ఐదువేల మందికి (ప్రతి ఇంటికి ఐదు కిలోల చొప్పున కూరగాయలు)... నియోజకవర్గంలోని వార్డ్ వాలెంటర్ల్లు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పురోహితులకు, మీడియా మిత్రులకు నిత్యవసర సరుకులు మరియు బియ్యం, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు...
 
ఎంపీ కి 45 రోజులు తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు....
ఇప్పటివరకు ఎక్కడ తాగి ఫామ్హౌస్లో పడుకున్నావ్ అని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు..


కెనాల్ రోడ్లో వ్యాపారస్తుల ను బెదిరించిన విషయం గుర్తు లేదా..
అవసరం లేకున్నా రహదారి వెడల్పు పేరుతో కెనాల్ రోడ్లో వ్యాపారుల ను బెదిరించిన నాని గురించి అందరికీ తెలుసన్నారు..
పుష్కరాల సమయంలో దుర్గ గుడి వద్ద గోశాల తొలగించవద్దు అని అడిగేందుకు వచ్చిన వ్యాపారులతో బీహార్ దొంగల తో పోల్చిన వారిని అవమానించిన విషయం వ్యాపారులు మర్చిపోలేదు అన్నారు..
ఎంపీ కార్యాలయం పక్కన ఉన్న పబ్లిక్ స్థలాన్ని కబ్జా చేసిన విషయంలో పోలీసులు నుంచి తాకీదు లు అందుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు


బోండా ఉమ అవాకులు చవాకులు పేలితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు..
నగరంలో ఐదు సంవత్సరాలు రౌడీ ఎమ్మెల్యే కి ప్రజలు ఓటు తో చెప్పిన గుణపాఠం సరిపోలేదా..
భార్య పేరుతో  భూకబ్జాలు... కుమారులు  బైక్ రైస్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నారు..


వ్యాపారుల ను,ప్రజలను పీడించు కునే పార్టీ టిడిపి..
వారికి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్సిపి ... 
విమర్శలు చేసే టీడీపీకి సేవలు చేసే వైసీపీతో పోటీ పడలేదు అన్నారు..
ప్రజలకు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని హామీ ఇచ్చారు...