పౌష్ఠిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి : సీడీపీఓ

పౌష్ఠిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి*
*సీడీపీఓ
వరికుంటపాడు 
అంగన్వాడీ కేంద్రం నుండి అందుకునే పౌష్ఠిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గర్భవతులు బాలింతలకు ఉదయగిరి సీడీపీఓ ఈస్టర్ రాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె కాంచెరువు, గువ్వడి, ఇస్కపల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న బలవర్దక ఆహారాన్ని తప్పకుండ ఆహరం గా తీసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. రక్త హీనత నివారణ కోసం తాజా పండ్లు, ఆకుకూరలను వినియోగించాలన్నారు. ఈ సందర్బంగా కాంచెరువు  అంగన్వాడీ కార్యకర్త పై గ్రామస్థులు అనేక పిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు మేడిశెట్టి విజయమ్మ, కాకి రూతమ్మ, కాకి భవాని, ఆశ కార్యకర్తలు ఉలసా  భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.