అంతర్జాతీయ మాతృ దినోత్సవం

అంతర్జాతీయ మాతృ దినోత్సవం


అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో)  40 ప్రపంచ దేశాలలో  ఈ రోజు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయించాలని మాతృ దినోత్సవంను ఏర్పాటుచేశారు.
ఈస్టర్కి ముందు నలభైరోజులను ‘లెంట్ రోజులుగా’ పరిగణిస్తారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండులో నలభై రోజులలోని నాలుగవ ఆదివారంనాడు తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాలు జరిపేవారు. 1872లో అమెరికాలో "జూలియావర్డ్ హోవే "అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, బోస్టన్ లో సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905, మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్‌జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారంనాడు మాతృ దినోత్సవంను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910లో వర్జీనియా,1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.  తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. క్షమ శ్రమ నేర్పు ఓర్పు మార్పు అన్నిటి సమ్మేళనమే అమ్మ. సహజంగా ఇవి స్త్రీ లక్షణాలు కాబట్టి దేవతలు శక్తినంతా కాపాడలేరు కాబట్టి ప్రతి ఇంటిలో ఒక మహిళ అన్న అమ్మతనం రూపొందించి, ఆ ఇంటిని దేవాలయంగా మార్చేందుకు అమ్మని సృష్టించాడు. తన బిడ్డని, ఇంటిని చక్కదిద్దుకునే  మాతృమూర్తుల సహజ లక్షణం, అది వారి బాధ్యత కూడా. అలాగే సమాజం పట్ల కూడా మాతృభావన కలిగినవారు చాలా అరుదుగా ఉంటారు. వారిలో మనకి గుర్తు వచ్చేది  పురాతన కాలంలో అత్రి,గార్గేయి వంటి వారు, తర్వాతి కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయ,రుద్రమదేవి వంటి వారు,తర్వాతి కాలంలో జ్యోతిరావు పూలే ,కస్తూరిబా గాంధీ , సరోజినీ నాయుడు ఇలాంటి మహిళలు భారత దేశానికి మొత్తం ఆదర్శం ఐతే మన నెల్లూరు విద్యా ,త్యాగ మాతృమూర్తి శ్రీమతి పొణకా కనకమ్మ తాను  పాఠశాలకు వెళ్లి చదువుకోని కారణంగా అనేకమంది  బాలికలు చదువుకోవాలని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి ఆడపిల్ల విద్యాధికురాలు అవ్వాలని  ప్రతి ఇంటికి గడప గడపకి తానే స్వయంగా వెళ్లి ఆడపిల్లల చదువుకై విశేష కృషి చేసిన వారు.  ఇలాంటి వారు జాతికే గా  మాతృమూర్తిగా వ్యవహరిస్తూ చిరస్థాయిగా నిలిచిపోతారు.క్షమ,శ్రమ,నేర్పు,ఓర్పు, మార్పుల సమ్మేళనమే అమ్మ. దైవత్వం దేవతతత్వం కలిగి ఉండేది అమ్మ. దేవతలు అందరి సంక్షేమం చూడలేరు, కాబట్టి అమ్మని దేవతగా కానుక ఇచ్చాడు.  తండ్రి,సవతితల్లి కైకేయి ఆజ్ఞను శిరసావహించిన శ్రీరాముడు, తల్లిదండ్రుల సేవించిన శ్రవణ కుమారుడు,శ్రవణకుమారుని కథను చదివి స్పూర్తి పొందిన మహాత్మా గాంధీజీ తల్లిదండ్రులను సేవించిన విధానం, వీరందరూ  మన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి  చిహ్నంగా మిగిలిపోయారు. "తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంటుంది"అనని ఖురాన్ లో చెప్పినట్టు, కుటుంబ కలహాలు, శత్రుత్వాలు ఉన్నా చివరకు తల్లితండ్రులకు బిడ్డలు అంతిమ సంస్కారాలు చేయటమే భారతీయ సంస్కృతి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనమే మాతృ భావన. "మాతృదేవోభవ, పితృదేవో భవ" అన్న మన సంస్కృతి సంప్రదాయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. శుభం భూయాత్.
  గూడూరు లక్ష్మి                           MA(Gandhian Thoughts),(LLB)                            అధ్యక్షులు: శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్, పొగతోట,నెల్లూరు.9441638900,    Email: kalalayalakshmi@gmail.com