ఆంధ్ర ప్రదేశ్  వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ సభ్యులుకు ఎంపీ  సుజనా చౌదరి  మరియు వారి ఫౌండేషన్ బియ్యం పంపిణీ

  ఎంపీ  సుజనా చౌదరి  మరియు వారి ఫౌండేషన్ ,హైదరాబాద్ కేంద్రంగా  పనిచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్  వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ సభ్యులు 200  మంది కి పైగా అందరికీ ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది 


హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ వర్కింగ్‌ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది సుజనా ఫౌండేషన్. ఇలాంటి విపత్కర సమయంలో సైతం పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకేరావు. ఈ కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సబ్యులు నంబూరి నరసింహారావు, కే. సురేష్‌ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా పెద్ద మనసుతో సహాయం చేసిన mp సుజనాచౌదరి గారికి మరియు ఫౌండేషన్ సీఈఓ ఏ కె రావు..సభ్యులు నంబూరి నరసింహరావు,సురేష్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము💐👏


ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందించి కష్టపడి పనిచేసిన కార్యవర్గ సభ్యులకు, మరియు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🙏👏


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్  యూనియన్ కార్యవర్గం