నీటి సమస్య పరిష్కారం కోరుతూ మహిళల ధర్నా*  

*నీటి సమస్య పరిష్కారం కోరుతూ మహిళల ధర్నా*
ఉదయగిరి ,మే 9 :
తమ కాలనీ వాసులకు తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ శనివారం కావలి  రోడ్డు లోని ఎస్ టి కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళల నిరసనకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ ఉదయగిరి మండల అధ్యక్షుడు గెట్టి బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 15 రోజులుగా బిందెడు నీటి నోచుకోలేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని గతంలో ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేస్తే సప్లై చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో వాళ్లు సరఫరా ఆపేశారు అని కాలనీలో సుమారు 70 కుటుంబాలకు ఒకే ఒక్క చేతి పంపు ఆధారంగా మారిందని అది కూడా రెండు బిందెల కంటే ఎక్కువ నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆవులయ్య మహిళలు పాల్గొన్నారు.