బ్రాహ్మణులకు సాయం చేయడం పూర్వజన్మ సుకృతం

*బ్రాహ్మణులకు సాయం చేయడం పూర్వజన్మ సుకృతం వింజమూరు, మే 5 (అంతిమతీర్పు -దయాకర్ రెడ్డి): ప్రతినిత్యం వేకువజామున ఆలయ శుద్ధి నుండి దేవదేవేరులకు విశేషాధి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ లోక కళ్యాణార్ధం పూజలు నిర్వహించే అర్చకులకు సాయం చేయడం పూర్వజన్మ సుకృతమని లాయర్ వార పత్రిక అధినేత తుంగా. శివప్రభాత్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డిలు అన్నారు. మంగళవారం నాడు వింజమూరులోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానంలో పలు దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు వింజమూరు మాజీ మండలాధ్యక్షులు గణపం.బాలక్రిష్ణారెడ్డి నేతృత్వంలో బియ్యం, వంట సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ తన పిన తండ్రి గణపం.ఓబులురెడ్డి జ్ఞాపకార్ధం ఆయన అల్లుడు శివప్రభాత్ రెడ్డి బ్రాహ్మణులకు నిత్యావసరాలను అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో బ్రాహ్మణులకు సహాయ సహకారములు అందిమ్కడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఆలయ అర్చకులు దాతలను వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్.పి.టి.సి సభ్యులు గణపం.సుజాతమ్మ, వై.సి.పి మండల మాజీ కన్వీనర్ మలిరెడ్డి.విజయకుమార్ రెడ్ది, దాసరి.అనిమిరెడ్డి, కొంకల.వెంకటేశ్వర్లురెడ్డి, బువ్వన.వెంకటేశ్వర్లు, కైపు.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.