పేదలకు చుండి హరిగోపాల్ రెడ్డి చేయూత

పేదలకు చుండి.హరిగోపాల్ రెడ్డి చేయూత


 దుత్తలూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): దుత్తలూరు మండలంలోని పలు ప్రాంతాలలో గురువారం నాడు బి.జె.పి మండల శాఖ అధ్యక్షులు చుండి.హరిగోపాల్ రెడ్డి నేతృత్వంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరించి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదన్నారు. ప్రధానమత్రి నరేంద్రమోదీ సాహసోపేతమైన నిర్ణయంతో మన దేశంలో కొంతమేర కరోనా విజృంభణను కట్టడి చేయగలిగామన్నారు. కరోనా ముప్పును ముందుగానే పసిగట్టిన ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూతో ప్రజలను ఏకతాటిపై నడిపించగలిగారన్నారు. ఆర్ధిక వ్యవస్థ పతనమవుతున్నప్పటికీ లెక్క చేయకుండా ప్రజల సం క్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలు, నిర్ణయాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశాలుగా పరిగణించవచ్చునన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు చుండి.హరిగోపాల్ రెడ్డి అధ్వర్యంలో బి.జె.పి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమాలలో అంత్యోదయ మున్సిపల్ కో-ఆర్డినేటర్ మేకపాటి.మాల్యాద్రినాయుడు, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.