వీడియో కాన్ ఫరెన్స్ లో వింజమూరు అధికారులు

వీడియో కాన్ ఫరెన్స్ లో వింజమూరు అధికారులు


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ లు జిల్లా వ్యాప్తంగా తహసిల్ధారు కార్యాలయాలలో గురువారం నాడు నిర్వహించిన వీడియో కాన్ ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్థానిక తహసిల్ధారు కార్యాలయంలో ఈ సందర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా క్వారంటైన్ సెంటర్ నిర్వహణ గురించి అధికారులకు వివరించడం జరిగిందన్నారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామని, వలస వాసులను వారి వారి ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులకు తెలియపరిచామన్నారు. తదుపరి మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలపై వివరించామన్నారు. త్వరలో అర్హులైన వారికి ఇంటి నివేశన స్థలాలను మంజూరు చేసేందుకు ఇప్పటివరకు రూపొందించిన ప్రణాళికలు, లే అవుట్లు వివరాలను అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓ ఎస్.కనకదుర్గా భవానీ, ప్రభుత్వ వైధ్యాధికారి డాక్టర్ హరిక్రిష్ణ, గ్రామీణ నీటి పారుదల శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.