అర్చకులకు తిప్పిరెడ్డి.నారపరెడ్డి ఆర్ధికసాయం

అర్చకులకు తిప్పిరెడ్డి.నారపరెడ్డి ఆర్ధికసాయం


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరులో పలు దేవస్థానాలలో పనిచేస్తున్న అర్చకులకు గురువారం నాడు మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయమును అందజేశారు. ఊ సందర్భంగా స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వింజమూరు మంXఅలంలో పురాతన చరిత్రలు కలిగిన ఆలయాలు ఉన్నాయన్నారు. తమ పూర్వీకుల కాలం నుండి కూడా అర్చక కుటుంబాలు ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉండేయన్నారు. తాము నేటికీ బ్రాహ్మణులకు ఎంతగానో సేవలందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో పెను ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారితో ఎటు చూసినా కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ వలన ఆలయాలు దీప ధూప నైవేద్యాలు మినహా భక్తులు విశేషంగా పూజలు నిర్వహించే పరిస్థితులు లేవన్నారు. ఫలితంగా అర్చకుల కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయాలను గమనించి తన వంతు సాయంగా కొంత నగదును అందజేయడం జరిగిందన్నారు.