లాక్ డౌన్ కష్ఠ కాలంలో పేదవారిని ఆదుకునేందుకు సిధ్ధం రియల్టర్ తటవర్తి రమేష్....
కావలి మే 2 ( అంతిమ తీర్పు ) : తటవర్తి రమేష్ దాత్రుత్వం తో కావలి పట్టణంలోని 8 వ వార్డు లో లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 50 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, కోడి గుడ్లు, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తటవర్తి రమేష్ మాట్లాడుతూ కరోనా వ్యాధి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విపత్కర పరిస్థితి లో నిరుపేద కుటుంబాలకు ఆదుకునేందుకు ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బదిరి, సత్యా, ఆలా శ్రీనివాసులు. గోపాల్ రెడ్డి. ఆలా శ్రీ లక్ష్మీ ,గోపి తదితరులు పాల్గొన్నారు.