మండల టీమ్లు కోయంబేడు కాంటాక్ట్ లు పై దృష్టి పెట్టాలి

 


మండల టీమ్లు కోయంబేడు కాంటాక్ట్ లు పై దృష్టి పెట్టాలి.


కేసులు నమోదు అయినా భయపడాల్సిన పనిలేదు, రెడ్ జోన్ నియమాలను పాటించండి.. జిల్లా కలెక్టర్, సత్యవేడు శాసనసభ్యులు


నాగలాపురం, పిచ్చాటూరు, మే 12 : జిల్లాలో కోయంబేడు మార్కెట్ తో సంబంధాలు వున్న కేసులు నమోదు జరుగుతున్నాయని, ఇప్పటికే మార్కెట్ తో సంబంధాలు వున్నవారిని జాబితా మేరకు కోవిడ్ స్యాబ్ పరీక్షలు నిర్వహణ జరుగుతున్నదని రెడ్ జోన్ లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. మంగళవారం మద్యాహ్నఁ నాగలాపురం, పిచ్చాటూరు మండల కేంద్రాల్లో పాజిటివ్ నమోదు ప్రాంతాలను సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం కలసి జిల్లా కలెక్టర్ పర్యటించారు. రెడ్ జోన్లలో శానిటేషన్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  పాజిటివ్ కేసులు నమోదు అయిన మాత్రాన భయపడాల్సిన పనిలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించి ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కోయంబేడు కాంటాక్ట్ జాభితా గుర్తించి మండలాల వారిగా పంపించడం జరిగిందని, సెకండరీ కాంటాక్ట్ పై దృష్టి పెట్టాలని, 60 సం. పైబడిన వారిని తప్పనిసరి టెస్టులు చేయాలని, నెగటివ్ వున్నా క్వారేంటైన్ కు పంపాలని సూచించారు.  భౌతిక దూరం, మాస్కులు వంటి జాగ్రత్తలు
అలవాటు చేసుకోవాలని సూచించారు. బయట రాష్ట్రంలో ఉన్న మనవాళ్లు స్వంత గ్రామాలకు రానున్నారని, వారి క్వారేంటైన్ కోసం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు 4900 గుర్తించి 20,000 మందికి సరిపడా వసతి,  బస 14 రోజులపాటు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కోయంబేడు కాంటాక్ట్ లు ఏఒక్కరు తప్పిపోకుండా గుర్తింపు, బయటి ర్రాష్టాల నుండి రానున్న మన జిల్లా వాసులకు క్వారేంటైన్ భాద్యత తహసీల్దార్ లు చూడాలని సూచించారు. జిల్లాకు రానున్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.


జిల్లా కలెక్టర్ పర్యటన లో మండల అధికారులు, వైద్య అధికారులు, పోలిస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.